‘కలివి వనం’ చిత్ర ట్రైలర్ లాంచ్‌ – నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల

‘కలివి వనం’ చిత్ర ట్రైలర్ లాంచ్‌ – నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల

Published on Nov 8, 2025 8:00 AM IST

Kalivi Vanam

తెలంగాణ పల్లెటూరి నేపథ్యంతో, వనాలను సంరక్షించాలనే గొప్ప సందేశంతో రూపుదిద్దుకున్న చిత్రం “కలివి వనం” నవంబర్ 21న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఏఆర్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్ నరేంద్ర రచన, దర్శకత్వంలో మల్లికార్జున్ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. రఘుబాబు, సమ్మెట గాంధీ, విజయలక్ష్మి, బిత్తిరి సత్తి, బలగం సత్యనారాయణ, మహేంద్ర నాథ్, సతీష్ శ్రీ చరణ్, అశోక్ వంటివారు కీలకపాత్రలు పోషించగా, నాగదుర్గ హీరోయిన్‌గా పరిచయమవుతోంది.

తాజాగా, సీనియర్ జర్నలిస్టుల చేతుల మీదుగా చిత్ర ట్రైలర్ మరియు నవంబర్ 21 రిలీజ్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ నరేంద్ర మాట్లాడుతూ, సినిమా అంటే కేవలం వినోదమే కాదు, విజ్ఞానం కూడా అని ఉద్ఘాటించారు. ప్రకృతి పట్ల ప్రేమ, అవగాహనను పిల్లలకు చిన్నప్పుడే నేర్పించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ సినిమా తీసినట్లు తెలిపారు. “ఇది కుటుంబమంతా కలిసి చూడదగిన చిత్రం. పిల్లల జీవితశైలిలో ఇది ఒక పాఠ్యభాగంలా నిలిచిపోతుంది” అని ఆయన అన్నారు.

చిత్ర నటుడు సమ్మెట గాంధీ మాట్లాడుతూ, అడవుల ప్రాముఖ్యతపై సినిమా చాలా బాగా వచ్చిందని, దర్శకనిర్మాతలు డబ్బుకు వెనుకాడకుండా జగిత్యాల పరిసర ప్రాంతాల్లో ఎంతో కష్టపడి చిత్రీకరణ చేశారని తెలిపారు. ఇది చిన్న సినిమా కాదని, మంచి కాన్సెప్ట్‌తో వస్తున్న పెద్ద సినిమా అని పేర్కొన్నారు. ఈ మంచి ప్రయత్నాన్ని మీడియా మిత్రులు ప్రోత్సహించాలని కోరారు. మ్యూజిక్ డైరెక్టర్ మదీన్ ఎస్.కె కూడా చిత్ర బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు