‘గత వైభవం’ బ్లాక్‌బస్టర్ కావాలని కోరుతున్నా – అక్కినేని నాగార్జున

‘గత వైభవం’ బ్లాక్‌బస్టర్ కావాలని కోరుతున్నా – అక్కినేని నాగార్జున

Published on Nov 11, 2025 8:22 AM IST

gaha

ఎస్‌.ఎస్‌. దుష్యంత్, ఆషికా రంగనాథ్ జంటగా నటించిన ‘గత వైభవం’ అనే ఎపిక్ ఫాంటసీ డ్రామా ఈ నెల 14న విడుదల కానుంది. సింపుల్ సుని దర్శకత్వంలో దీపక్ తిమ్మప్ప, సుని నిర్మించిన ఈ చిత్రానికి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌ సమర్పకులు. తాజాగా జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు కింగ్ నాగార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. “గత జన్మల కాన్సెప్ట్ నాకు ఎప్పుడూ ఆసక్తికరంగా ఉంటుంది. గత వైభవం ట్రైలర్ చూస్తే టీమ్ ఎంతో కష్టపడ్డారని తెలుస్తుంది. దుష్యంత్, ఆషికా ఇద్దరూ అద్భుతంగా కనిపిస్తున్నారు. ఈ సినిమా పెద్ద హిట్ కావాలి” అని అన్నారు.

హీరో దుష్యంత్ మాట్లాడుతూ.. “నాగార్జున గారి సపోర్ట్ మా అదృష్టం. మా సినిమా నాలుగు జన్మల కథతో కొత్త స్క్రీన్‌ప్లేతో రూపొందింది. తెలుగు ప్రేక్షకుల ప్రేమ, సపోర్ట్ మాకు కావాలి” అని తెలిపారు.

ఆషికా రంగనాథ్ మాట్లాడుతూ.. “ఈ సినిమా మనసుకు దగ్గరగా ఉంటుంది. నాగార్జున గారు మా ఈవెంట్‌కు రావడం మా టీమ్‌కు పెద్ద గౌరవం” అన్నారు.

దర్శకుడు సింపుల్ సుని మాట్లాడుతూ.. “గత వైభవం కమర్షియల్ విలువలతో కూడిన డిఫరెంట్ జానర్ మూవీ. ప్రేక్షకులు తప్పకుండా ఇష్టపడతారని నమ్ముతున్నాము” అని అన్నారు.

నిర్మాతలు దీపక్, చైతన్య రెడ్డి మాట్లాడుతూ.. “నాగార్జున గారు మా వేడుకకు రావడం ఆనందంగా ఉంది. గత వైభవం తెలుగులో కొత్త ఫాంటసీ అనుభూతి ఇస్తుంది” అని పేర్కొన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు