ఆస్కార్ అవార్డు గ్రహీత చంద్రబోస్ చేతుల మీదుగా మాస్టర్ మహేంద్రన్ హీరోగా నటించిన ‘వసుదేవసుతం’ చిత్రం నుంచి ‘ఏమైపోతుందో’ అనే మెలోడీ గీతం విడుదలైంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించిన ఈ పాటకు శ్రీ హర్ష ఈమని సాహిత్యం సమకూర్చగా, పవన్, శృతిక సముద్రాల గాత్రం అందించారు. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమను, వారి కెమిస్ట్రీని అందంగా చూపుతూ ఈ లిరికల్ వీడియో రూపొందింది. ఇందులో చూపించిన లొకేషన్స్ కూడా సహజంగా ఆకట్టుకున్నాయి.
పాటను విడుదల చేసిన అనంతరం చంద్రబోస్ మాట్లాడుతూ, ‘వసుదేవసుతం’లోని ఈ పాట చాలా బాగుందని, మణిశర్మ మంచి ట్యూన్‌ను, సాహిత్యం కూడా చాలా బాగుందని కొనియాడారు. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పి, సినిమా పెద్ద విజయం సాధించాలని ఆకాంక్షించారు. వైకుంఠ్ బోను దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ధనలక్ష్మి బాదర్ల (బేబీ చైత్ర శ్రీ బాదర్ల, మాస్టర్ యువ్వాంశ్ కృష్ణ బాదర్ల సమర్పణలో) రెయిన్‌బో సినిమాస్ బ్యానర్‌పై నిర్మించారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌లు ఆకట్టుకోగా, అంతకుముందు ఆకాష్ జగన్నాథ్ విడుదల చేసిన టైటిల్ సాంగ్ కూడా ప్రేక్షకులను మెప్పించింది. త్వరలోనే విడుదల తేదీ వివరాలను ప్రకటిస్తామని చిత్రయూనిట్ తెలిపింది.


