ఇండియన్ సినిమాని మరో స్థాయికి తీసుకెళ్లిన సినిమానే బాహుబలి. దర్శకుడు రాజమౌళి హీరో ప్రభాస్ ల నుంచి వచ్చిన ఈ ఎపిక్ సినిమా ముందు రోజుల్లో గ్లోబల్ ఆడియెన్స్ ని కూడా అలరించేందుకు వెళుతుంది. బాహుబలి పాత్రని యానిమేషన్ రూపంలోకి మార్చి బాహుబలి ది ఎటర్నల్ వార్ గా కొత్త చిత్రాన్ని హాలీవుడ్ లెవెల్ హంగులతో అనౌన్స్ చేసి అందరికీ షాకిచ్చారు.
అయితే ఈ చిత్రాన్ని దర్శకుడు రాజమౌళి కాకుండా ఇలాంటి యానిమేషన్ కంటెంట్ పై మంచి పట్టు ఉన్న దర్శకుడు ఇషాన్ శుక్లా తెరకెక్కిస్తున్నారు. అయితే బాహుబలి ఎటర్నల్ వార్ టీజర్ ట్రైలర్ వచ్చినపుడు అందులో ఓ సీక్వెన్స్ పాపులర్ హాలీవుడ్ యానిమేషన్ చిత్రం కుంగుఫు పాండా లోని ఓ యాక్షన్ సీన్ కి కాపీలా ఉందని కొన్ని కంప్లైంట్స్ వచ్చాయి.
అయితే దీనిపై దర్శకుడు స్పందించడం జరిగింది. తాను అసలు ఆ సినిమా చూడనే లేదని తాను అసలు విషయం చెప్పుకోవచ్చు. రెండు ఫైట్ సీన్స్ కూడా గాలి లోనే ప్రధానంగా ఉండేసరికి చాలా మందికి అనిపించి ఉండొచ్చు కానీ బాహుబలి లో అలానే ఎందుకు పెట్టాము అనే దానికి కారణం సినిమాలో తెలుస్తుంది అని తాను క్లారిటీ ఇచ్చారు. సో దానికి దీనికి ఎలాంటి సంబంధం లేదని చెప్పొచ్చు.


