గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను కలయికలో చేసిన అవైటెడ్ చిత్రమే “అఖండ 2 తాండవం”. భారీ అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమా గ్రాండ్ ప్రీమియర్స్ తో నిన్న రాత్రి షోస్ నుంచే మొదలైంది. ఇక ఫైనల్ గా ఈ సినిమా టాక్ తో సంబంధం లేకుండా సాలిడ్ బుకింగ్స్ కనబరుస్తుండగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్రీమియర్స్ పడ్డాయి.
నైజాంలో గట్టి మొత్తంలోనే ప్రీమియర్స్
బాలయ్య అఖండ 2 కి నైజాం మార్కెట్ లో కూడా మంచి హైప్ నెలకొంది. ఇలా నైజాం ప్రాంతంలో ప్రీమియర్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగా మాస్ రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇలా కేవలం ప్రీమియర్స్ వసూళ్ళగానే 2.3 కోట్ల షేర్ ని ఈ సినిమా రాబట్టిందట. దీనితో ఈ మధ్య కాలంలో ప్రీమియర్స్ తో వచ్చిన సినిమాల్లో మంచి ఓపెనర్ గా ఇది నిలిచింది.
ఏపీలో పరిస్థితి ఏంటి?
ఏపీలో కూడా అఖండ 2 ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలాగే సీడెడ్ లాంటి ఏరియాలు ఇంకా మరికొన్ని మాస్ ప్రాంతాల్లో సాలిడ్ ఆక్యుపెన్సీలు కనిపించాయి. కానీ వీటిని మించి డే 1 వసూళ్లు అఖండ 2 కి ఎక్కువ ఉంటాయని సమాచారం. సో ఏపీలో డే 1 భారీగా రావచ్చు.


