పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ అలాగే మాళవిక మోహనన్ లు హీరోయిన్స్ గా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తున్న అవైటెడ్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ చిత్రమే “ది రాజా సాబ్”. మంచి బజ్ ఉన్న ఈ చిత్రంకి సంబంధించి మేకర్స్ ఓ కొత్త సిరీస్ ని సినిమా మేకింగ్ అండ్ ఇతర ప్రాసెస్ లు ఎలా జరిగాయి అనే దానికోసం రివీల్ చేసారు.
అయితే ఇందులో వచ్చిన ఫస్ట్ ఎపిసోడ్ లో మారుతీ కామెంట్స్ తో ఈ పర్టిక్యులర్ సినిమాకి బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఏదన్నా ఉంది అంటే అది సినిమా కథ కోసమే అని అర్ధం అవుతుంది. ప్రభాస్ గారికి తన ప్రేమ కథా చిత్రం బాగా నచ్చింది అని అలాంటి లైన్ తో ఏదన్నా సినిమా ప్లాన్ చేయమన్నారని తెలిపారు.
కానీ ప్రేమ కథా చిత్రం తర్వాత అదే కాన్సెప్ట్ లో 500 పైగా సినిమాలు వచ్చేసాయి అని అలాంటిది ఒక బిగ్ స్టార్ తో ఆ జానర్ లో అంతకు మించి ఎలిమెంట్ పెట్టాలనే ప్లాన్ లో బలమైన విలన్ ని డిజైన్ చేసినట్టు తెలిపారు. అదే సినిమా సినిమాలో రేపు అందరినీ సర్ప్రైజ్ చేస్తుందని తాను తెలిపారు. సో ది రాజా సాబ్ సినిమాలో ఏదైతే పెద్ద ఛాలెంజ్ అనిపించిందో అదే బిగ్ సర్ప్రైజ్ కూడా అని చెప్పాలి.


