రవితేజ క్రేజీ ఫ్రాంచైజీ పై సరికొత్త బజ్..?

రవితేజ క్రేజీ ఫ్రాంచైజీ పై సరికొత్త బజ్..?

Published on Dec 14, 2025 1:00 AM IST

Ravi Teja

సురేందర్ రెడ్డి – రవితేజ కాంబినేషన్ మళ్లీ రిపీట్ అవుతుందన్న వార్త అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ‘కిక్’ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన ఈ జోడీ, కిక్ 2తో నిరాశపరిచినా, ఇప్పుడు ఈ ఫ్రాంచైజ్‌ను ‘కిక్-3’ రూపంలో కొనసాగించేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

‘ఏజెంట్’ ఫ్లాప్ తర్వాత సైలెంట్‌గా ఉన్న సురేందర్ రెడ్డి తాజాగా రవితేజకు ఓ కథ వినిపించగా, స్క్రిప్ట్ నచ్చడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. అయితే నిర్మాత మార్పు, ఇద్దరి మార్కెట్ తగ్గిన నేపథ్యంలో ‘కిక్’ ఫ్రాంచైజ్ క్రేజ్ సినిమాకు ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

ప్రస్తుతం రవితేజ ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ సినిమా చేస్తున్నారు. అది పూర్తయ్యాకే ‘కిక్ 3’ సెట్స్‌పైకి వెళ్లనుందని, ఈ సినిమాతో కంబ్యాక్ ఇవ్వాలని సురేందర్ రెడ్డి గట్టి స్క్రిప్ట్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు