డే 1 డీసెంట్ ఓపెనింగ్స్ అందుకున్న ‘మోగ్లీ’

డే 1 డీసెంట్ ఓపెనింగ్స్ అందుకున్న ‘మోగ్లీ’

Published on Dec 14, 2025 6:00 PM IST

mowgli 2025

యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రోషన్ కనకాల హీరోగా యువ నటి సాక్షి హీరోయిన్ గా దర్శకుడు సందీప్ రాజ్ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే “మోగ్లీ”. వీరితో పాటుగా సినిమాకి అదనపు వెయిట్ ఇచ్చిన టాలెంటెడ్ నటుడు బండి సరోజ్ నటించిన ఈ సినిమా మొన్న ప్రీమియర్స్ తోనే మొదలైంది. ఇలా నిన్న రిలీజ్ రోజు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి డీసెంట్ ఓపెనింగ్స్ మొదటి రోజు వచ్చినట్టు మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

ప్రీమియర్స్ ఇంకా డే 1 వసూళ్లు కలిపి ఈ సినిమా 1.22 కోట్ల గ్రాస్ ని అందుకొని ఒక ప్రామిసింగ్ ఓపెనర్ గా నిలిచింది. ఇక డే 2 కూడా ఇదే రీతిలో ఈ సినిమా పెర్ఫామ్ చేస్తుందని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి కాల భైరవ సంగీతం అందించగా సుహాస్, వైవా హర్ష తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించారు. అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు ఈ సినిమాని నిర్మాణం వహించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు