గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే అఖండ 2 తాండవం. భారీ హైప్ నడుమ పాన్ ఇండియా లెవెల్లో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో ఇప్పుడు సక్సెస్ ఫుల్ గా కొనసాగుతుంది. దర్శకుడు బోయపాటి శ్రీను బాలయ్యని మరోసారి మరింత పవర్ఫుల్ గా ప్రెజెంట్ చేయగా ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.
అయితే గతంలో పార్ట్ 1 కి కూడా మేకర్స్ ఊహించని విధమైన రెస్పాన్స్ థియేటర్స్ లో వచ్చింది. తండోపతండాలుగా జనం థియేటర్స్ కి ట్రాక్టర్లు లో కూడా వచ్చేసారు. అంతేనా ఈ సినిమాని నిజమైన అఘోరాలు, శివ భక్తులు కూడా థియేటర్స్ లో చూసారు. మరి ఇది నిజంగా ఒక ఇండియన్ సినిమాకి చాలా అరుదైన ఫీట్.
అఘోరాలు అంతా తమదైన లోకంలో ఉంటారు తప్పితే ఇలా వినోదం సినిమా థియేటర్స్ వైపు వెళ్లడం అనేది జరగదు కానీ దానిని అప్పుడు అఖండ 1 చూపిస్తే ఇప్పుడు మళ్ళీ అఖండ 2 ని కూడా థియేటర్స్ లో అఘోరాలు వీక్షిస్తున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో ఈ ఫీట్ మాత్రం ఒక్క అఖండ కి మాత్రమే సాధ్యం అయ్యిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.
धर्मो रक्षति रक्षितः ????????
मूवी ऐसे बनाओ कि खुद नागा साधु थियेटर आए
हर हर महादेव का उद्घोष करे.. अलख निरंजन
सनातन धर्म रक्षक मूवी.. आग लगा दी लिब्रांडू में#Akhanda2 #Akhanda2Thandavam pic.twitter.com/k9ZaJxZfkb
— kapil kumar ( sanatani ) (@KapilKu02080325) December 13, 2025


