అఖిల్ ‘లెనిన్’లో ఆ యంగ్ బ్యూటీ ?

అఖిల్ ‘లెనిన్’లో ఆ యంగ్ బ్యూటీ ?

Published on Dec 14, 2025 9:00 PM IST

1 4

అక్కినేని యంగ్ హీరో అఖిల్ ప్రస్తుతం తన లెనిన్ చిత్రాన్ని దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరి (నందు) డైరెక్షన్‌ లో చేస్తున్నాడు. ఐతే, తాజాగా ఈ సినిమా గురించి వినిపిస్తున్న అప్ డేట్ ప్రకారం ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ను డిజైన్ చేశారు. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండేని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె ఈ సాంగ్ తో పాటు ఓ చిన్న అతిధి పాత్రలో కూడా కనిపిస్తోందట.

కాగా ఈ సినిమా.. రాయలసీమ బ్యాక్‌ డ్రాప్‌ తో చిత్తూరు ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో అందాల భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. ఇక సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా అఖిల్ – భాగ్య శ్రీ కలయికలో లవ్ సీన్స్ చాలా బాగుంటాయట. అన్నట్టు ఈ సినిమా పై అఖిల్ చాలా హోప్స్ పెట్టుకున్నాడు. సినిమా అవుట్ ఫుట్ అయితే బాగా వస్తోందని టీమ్ చెబుతుంది. మరి ఈ సినిమాతో అఖిల్ హిట్ కొడతాడో లేదో చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు