బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ తన నటన గురించి చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ముఖ్యంగా తాను తనకు తోచినట్లుగా యాక్ట్ చేస్తానని, తానేం గొప్ప నటుడిని కాదని, పైగా ఎమోషనల్ సీన్‌లో తాను ఏడిస్తే.. ప్రేక్షకులు నవ్వుతారని సల్మాన్‌ఖాన్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. అసలు సల్మాన్ ఖాన్ ఎందుకు ఈ కామెంట్స్ చేశాడు అంటూ ఆయన ఫ్యాన్స్ పోస్ట్ లు పెడుతున్నారు. సౌదీ అరేబియాలో జరిగిన ‘రెడ్ సీ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్’లో సల్మాన్ ఇలా మాట్లాడారు.
గతంలో కూడా సల్మాన్ ఖాన్ ఇలా తనను తాను తగ్గించుకోవడాన్ని ఆయన అభిమానులు ఇష్టపడలేదు. ఇప్పుడు మళ్లీ ఆయన ఇలా కామెంట్స్ చేయడంతో వారు నిరాశకి గురి అవుతున్నారు. సల్మాన్ ఇంకా ఏం మాట్లాడారు అంటే.. ‘గత 25 ఏళ్లలో తాను బయట డిన్నర్ చేయలేదని.. తనకు ఇల్లు, షూటింగ్ స్పాట్, ఎయిర్‌పోర్టులే ప్రపంచంగా మారాయని సల్మాన్ ఖాన్ అన్నారు. మరోవైపు ఆయన అభిమానులు స్పందిస్తూ.. సల్మాన్ గ్రేట్ యాక్టర్ అంటూ పోస్ట్ లు పెడుతున్నారు.


