మల్కాజ్‌గిరిలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్యూర్ వెజ్ రెస్టారెంట్ ‘శుద్ద్ విలాస్’ను నటుడు శ్రీ విష్ణు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీ విష్ణు రెస్టారెంట్లో అందుబాటులో ఉన్న అన్ని రకాల వంటకాలను రుచి చూసి, రుచులు అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. నేటి ఆధునిక, వేగవంతమైన జీవనశైలిలో నాణ్యమైన, ఆరోగ్యకరమైన శాకాహారానికి డిమాండ్ పెరుగుతోందని ఈ సందర్భంగా ఆయన అన్నారు. శాకాహార ప్రియుల అభిరుచులకు తగ్గట్టుగా ప్రారంభించిన ‘శుద్ద్ విలాస్’ త్వరలోనే అందరికీ అభిమాన వేదికగా మారుతుందని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, దర్శకుడు శేఖర్ కమ్ముల, కోన వెంకట్ తదితరులు హాజరయ్యారు. భారతీయ పాక శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా ప్రామాణిక శాకాహార వంటకాలను అందించే లక్ష్యంతో ‘శుద్ద్ విలాస్’ను ప్రారంభించినట్లు బ్రాండ్ యజమానులు శశికాంత్, శ్రీరామ్ తెలిపారు. స్వచ్ఛత, స్థిరత్వం, వినియోగదారుల సంతృప్తి విషయంలో రాజీ పడకుండా ప్రమాణాలను పాటిస్తామని వారు హామీ ఇచ్చారు. సమీప భవిష్యత్తులో బ్రాండ్‌ను ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు వారు వెల్లడించారు. ఈ ప్రారంభోత్సవంలో మల్కాజ్గిరి బ్రాంచ్ భాగస్వాములు రాజీవ్, రాజ శేఖర్, హుస్సేన్, వెంకట్ మార్తాండ్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.


