అవతార్ క్రేజ్ తగ్గిందా..? బుకింగ్స్‌లో కనిపించని జోరు..!

అవతార్ క్రేజ్ తగ్గిందా..? బుకింగ్స్‌లో కనిపించని జోరు..!

Published on Dec 16, 2025 12:00 AM IST

Avatar-Fire-and-Ash

హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు జేమ్స్ కామెరూన్ తెరకెక్కించిన ‘అవతార్’ విజువల్ వండర్‌గా యావత్ సినీ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ఆ సినిమాతో దర్శకుడు జేమ్స్ కామెరూన్ మరో కొత్త ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక ఆ సినిమా రిలీజ్ తర్వాత వరల్డ్ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. వసూళ్లతో పాటు పలు ప్రతిష్టాత్మక అవార్డులను సైతం ఆ సినిమా సాధించింది.

ఇక తొలి భాగం వచ్చిన 13 ఏళ్లకు ‘అవతార్ 2’ రిలీజ్ అయింది. మొదటి భాగం తెచ్చిపెట్టిన హైప్‌తో రెండో భాగాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు పెట్టారు. అయితే, సినిమా చూసిన చాలా మంది ప్రేక్షకులకు తొలి భాగం ఇచ్చినంత కిక్ ఇవ్వలేదనేది వాస్తవం. రెండో భాగం కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి విజాయన్ని అందుకుంది. ఇక ఇప్పుడు ఈ ఫ్రాంచైజీలో మూడో భాగం తీసుకొస్తున్నాడు దర్శకుడు.

‘అవతార్ : ఫైర్ అండ్ యాష్’ అనే సినిమాతో డిసెంబర్ 19న మనముందుకు రానున్నారు. ఈ సినిమా బుకింగ్స్ ఇప్పటికే తెరుచుకున్నాయి. అయితే, బుకింగ్స్‌లో గతంలో మాదిరిగా క్రేజ్, జోష్ కనిపించడం లేదు. దీంతో అవతార్ క్రేజ్ తగ్గిందా..? అనే ప్రశ్న ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కాగా, తొలి రెండు భాగాలకు ఈ సినిమా పూర్తి భిన్నంగా ఉండబోతుందని మేకర్స్ కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు. మరి ‘అవతార్ 3’ బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో వేచి చూడాలి.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు