రికార్డులకు టెండర్ పెట్టే కాంబో.. ఫిక్స్ అయితే మాత్రం వేరే లేవెల్..!

రికార్డులకు టెండర్ పెట్టే కాంబో.. ఫిక్స్ అయితే మాత్రం వేరే లేవెల్..!

Published on Dec 15, 2025 11:30 PM IST

NTR Allu Arjun

టాలీవుడ్‌లో మల్టీస్టారర్ చిత్రాలకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో అందరికీ తెలిసిందే. ఇద్దరు హీరోలు కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే, అభిమానులకు ఫుల్ ట్రీట్ ఖాయం. ఇప్పటికే తెలుగులో చాలా మల్టీస్టారర్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర సందడి చేశాయి. అయితే, ఇప్పుడు మరో సెన్సేషనల్ మల్టీస్టారర్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

తమిళ దర్శకులు లోకేష్ కనగరాజ్ ఈ మేరకు సాలిడ్ ప్రయత్నాలు చేస్తున్నాడట. ఆయన రీసెంట్‌గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను కలిసి ఓ కథను వినిపించాడట. ఈ కథలో మరో హీరో కూడా ఉంటాడని.. అయితే, తాను మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్‌ను ఆ పాత్రకు ఊహించుకున్నట్లు లోకేష్ తెలిపాడు. దీంతో అల్లు అర్జున్ కూడా ఆసక్తిని చూపాడని.. ఎన్టీఆర్ ఆ పాత్రకు ఒప్పుకుంటే, తాను ఖచ్చితంగా సినిమా చేస్తానని చెప్పినట్లు తెలుస్తోంది.

ఇక ఇప్పుడు లోకేష్ ఎన్టీఆర్‌ను ఆ పాత్రకు ఒప్పించేందుకు రెడీ అవుతున్నాడట. ఎన్టీఆర్ ఇప్పటికే ఆర్ఆర్ఆర్, వార్-2 వంటి మల్టీస్టారర్ చిత్రాల్లో నటించాడు. ఒకవేళ లోకేష్ సినిమాకు ఓకే చెబితే ఆయనకు ఇది మూడో మల్టీస్టారర్ చిత్రం అవుతుంది. ఇక ఈ కాంబో గనుక సెట్ అయితే, బాక్సాఫీస్ రికార్డులకు టెండర్ పెట్టడం ఖాయమని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు