పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్‌టు బ్యాక్ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’(Spirit), ‘స్పిరిట్’ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత ‘కల్కి 2898 ఏడి’, ‘సలార్’ సీక్వెల్స్‌లో కూడా ఆయన నటించనున్నాడు.
అయితే, ఈ సినిమాల్లో ‘స్పిరిట్’ చిత్రాన్ని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో చేయనున్నాడు. దీంతో ఈ ప్రాజెక్ట్‌పై అదిరిపోయే క్రేజ్ క్రియేట్ అయింది. ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు చిత్ర యూనిట్. షూటింగ్ కోసం ప్రత్యేకంగా ఖరీదైన సెట్లను నిర్మించిన మేకర్స్, త్వరలో ప్రభాస్(Prabhas) ఇంట్రడక్షన్ సాంగ్‌తో పాటు పవర్ఫుల్ యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ యాక్షన్ సీక్వెన్స్‌లో ప్రభాస్ ఇప్పటివరకు ఎప్పుడూ చూడని కొత్త అవతార్‌లో దర్శనం ఇవ్వనున్నాడని తెలుస్తోంది. ఈ సన్నివేశం అభిమానులకు ఎప్పటికీ గుర్తుండిపోయేలా డిజైన్ చేశారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ ఫైట్‌లో ప్రభాస్ ఒంటరిగా రెండు వందలకు పైగా ఫైటర్లను ఢీ కొట్టనున్నాడట. ఇక ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలైట్ కానుందట.
ఈ చిత్రంలో హీరోయిన్గా త్రిప్తి డిమ్రీ(Tripti Dimri) నటిస్తుండగా, ప్రకాష్ రాజ్, వివేక్ ఓబెరాయ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టీ-సిరీస్, భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్లపై గ్రాండ్‌గా నిర్మిస్తున్నారు.


