Jana Nayagan: అనిరుద్ నెక్స్ట్ ట్రీట్ కి డేట్ ఫిక్స్!

Jana Nayagan: అనిరుద్ నెక్స్ట్ ట్రీట్ కి డేట్ ఫిక్స్!

Published on Dec 16, 2025 6:30 PM IST

Jana-Nayagan

ఇళయ దళపతి విజయ్ హీరోగా హీరోయిన్ పూజా హెగ్డే అలాగే మమిత బైజు కీలక పాత్రలో దర్శకుడు హెచ్ వినోద్ తెరకెక్కిస్తున్న అవైటెడ్ చిత్రమే “జన నాయగన్”. తెలుగులో జన నాయకుడు పేరిట రిలీజ్ కి ప్లాన్ చేస్తున్న ఈ సినిమాకి సెన్సేషనల్ సంగీత దర్శకుడు అనిరుద్ వర్క్ చేస్తున్నాడు. అయితే అనిరుద్ నుంచి ఆల్రెడీ వచ్చిన మొదటి సాంగ్ మంచి హిట్ అయ్యింది.

ఇక నెక్స్ట్ అంతా అభిమానులు రెండో సాంగ్ కోసం చూస్తుండగా దీనిపై ఫైనల్ గా ఓ సాలిడ్ పోస్టర్ తో అప్డేట్ అందించారు. విజయ్ పై ఒక స్ట్రైకింగ్ పోస్టర్ ని రిలీజ్ చేసి మేకర్స్ ఫ్యాన్స్ కి కిక్ ఇచ్చారు. ఇక ఈ సాంగ్ ని డిసెంబర్ 18న రిలీజ్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశారు. సో ఈ సాంగ్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. మరి ఈ సినిమాని కే వి ఎన్ ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించగా ఈ జనవరి 9న గ్రాండ్ గా తెలుగు ఇంకా తమిళ్ లో రిలీజ్ కి తీసుకొస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు