పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉదయ్ భాస్కర్ ‘2nd Innings’ – త్వరలో విడుదల తేది ప్రకటన

పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉదయ్ భాస్కర్ ‘2nd Innings’ – త్వరలో విడుదల తేది ప్రకటన

Published on Dec 19, 2025 8:00 AM IST

Uday Bhaskar

పదహారు ఏళ్ల సుదీర్ఘ నటనా అనుభవంతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉదయ్ భాస్కర్, ‘2nd Innings’ చిత్రంతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యారు. రంగస్థలం, బుల్లితెర, వెండితెరపై సహజమైన నటనతో మెప్పించిన ఆయన, ఈ చిత్రంలో ఓ బరువైన, భావోద్వేగభరితమైన పాత్రను పోషిస్తున్నారు.

ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. కళ్లతోనే భావాలను పలికించే ఉదయ్ భాస్కర్ నటన ఈ సినిమాకు ప్రధాన బలమని చిత్ర యూనిట్ పేర్కొంది. ఆర్భాటాలకు పోకుండా, పాత్రలో లీనమై ఆయన చేసిన ప్రదర్శన ప్రేక్షకులను కదిలిస్తుందని, ఇది ఆయన కెరీర్‌లో ఒక మైలురాయిగా నిలుస్తుందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

ముఖ్యంగా సహనటి నక్షత్రతో ఆయన పండించిన కెమిస్ట్రీ, సన్నివేశాల్లోని నిజాయితీ సినిమాకు అదనపు ఆకర్షణగా నిలవనున్నాయి. భావోద్వేగాలకు పెద్దపీట వేస్తూ తెరకెక్కిన ‘2nd Innings’ విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు