మన టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రామ్ పోతినేని హీరోగా భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా దర్శకుడు మహేష్ బాబు పి తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రమే ‘ఆంధ్ర కింగ్ తాలూకా’. మంచి బజ్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా రామ్ కెరీర్ లో ఒక డీసెంట్ పెర్ఫార్మర్ గా నిలిచింది. ఇక ఈ సినిమాలో రియల్ స్టార్ ఉపేంద్ర కూడా నటించగా థియేటర్స్ నుంచి ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా ఓటిటిలోకి వచ్చేందుకు సిద్ధం అయ్యింది.
ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు దిగ్గజ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక అందులో ఈ సినిమా ఈ డిసెంబర్ 25 క్రిస్మస్ కానుకగా స్ట్రీమింగ్ కి తెస్తున్నట్టుగా నెట్ ఫ్లిక్స్ వారు ఇప్పుడు అనౌన్స్ చేసేసారు. ఇక ఈ సినిమాని మొత్తం పాన్ ఇండియా భాషల్లో తెస్తున్నట్టు కూడా కన్ఫర్మ్ చేశారు. మరి ఓటిటిలోకి వచ్చాక ఈ సినిమా ఎలాంటి రెస్పాన్స్ ని అందుకుంటుందో చూడాలి. ఇక ఈ సినిమాకి వివేక్ మెర్విన్ లు సంగీతం అందించగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహించారు.


