‘ఈషా’ వార్నింగ్ వీడియో.. భయపడటం ఖాయం..!

‘ఈషా’ వార్నింగ్ వీడియో.. భయపడటం ఖాయం..!

Published on Dec 20, 2025 6:35 PM IST

eesha 2

ఇటీవల లిటిల్ హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి వంటి కల్ట్ హిట్లతో గుర్తింపు తెచ్చుకున్న బన్నీవాస్–వంశీ నందిపాటి ద్వయం, తాజాగా ‘ఈషా’ పేరుతో ఓ హారర్ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీవాస్ వర్క్స్ బ్యానర్లపై రూపొందిన ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు. అఖిల్‌రాజ్, త్రిగుణ్ హీరోలుగా నటిస్తున్న ఈ సినిమాలో హెబ్బా పటేల్ కథానాయికగా కనిపించనుండగా, సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్ కీలక పాత్రల్లో నటించారు. హెచ్‌వీఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై కేఎల్ దామోదర ప్రసాద్ సమర్పణలో హేమ వెంకటేశ్వరరావు ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌కు అంచనాలకు మించి స్పందన లభించింది. ముఖ్యంగా హార్ట్ వీక్ ఉన్నవారు ఈ సినిమా చూడొద్దంటూ మేకర్స్ ఇచ్చిన వార్నింగ్‌ అప్పట్లో చర్చనీయాంశమైంది. తాజాగా ‘ఈషా వార్నింగ్ వీడియో’ పేరుతో మరో వీడియోను విడుదల చేయగా, హారర్ థ్రిల్లర్ జానర్‌లో ఇలాంటి కాన్సెప్ట్‌తో వార్నింగ్ ఇవ్వడం ఇదే తొలిసారి కావడం ఆసక్తిని పెంచింది. పుట్టుకతోనే శాపగ్రస్తమైన కొన్ని ప్రదేశాలు క్రమంగా ఆత్మల నివాసాలుగా మారతాయన్న డైలాగ్స్ ప్రేక్షకులను భయపెడుతున్నాయి.

ఆత్మలు లేవని నమ్మే స్నేహితుల కథగా మొదలయ్యే ఈ సినిమా, సైన్స్‌కు అతీంద్రియ శక్తులకు మధ్య జరిగే క్లాష్‌ను ఆసక్తికరంగా చూపించనుంది. పాడుబడిన బంగ్లా, క్షుద్ర పూజల సెటప్, డార్క్ అండ్ బ్లూ టోన్ విజువల్స్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. సంతోష్ కెమెరా పనితనం, ఆర్ఆర్ ధృవన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, సౌండ్ డిజైన్ కలిసి భయాన్ని మరింత ఎలివేట్ చేస్తున్నాయి. ఇప్పటికే వీడియోలే ఇంత భయపెడుతున్నాయంటే, డిసెంబర్ 25 నుంచి థియేటర్లలో అనుభూతి ఎలా ఉంటుందో ఊహించుకోవడమే గగనంగా మారింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు