ఇంటర్వ్యూ : నిర్మాతలు రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి – ‘శంబాల’ చాలా డిఫరెంట్ సినిమా..!

ఇంటర్వ్యూ : నిర్మాతలు రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి – ‘శంబాల’ చాలా డిఫరెంట్ సినిమా..!

Published on Dec 21, 2025 1:02 AM IST

Shambala-Movie

విలక్షణ నటుడు ఆది సాయి కుమార్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందిన డిఫరెంట్ హారర్ ఎంటర్‌టైనర్ ‘శంబాల’ కు యగంధర్ ముని దర్శకత్వం వహించారు. రాజశేఖర్ అన్నభిమోజు, మహీధర్ రెడ్డి నిర్మాతలు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ మంచి హైప్‌ను క్రియేట్ చేశాయి. ఈ చిత్రం డిసెంబర్ 25న భారీగా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నిర్మాతలు చిత్ర విశేషాలను పంచుకున్నారు.

ఈ సినిమా స్క్రిప్ట్ వినగానే మీకు నచ్చింది ఏంటి?

స్క్రిప్ట్ కన్నా ముందు స్టోరీ. కథ బాగా నచ్చడంతో డివోషనల్, హారర్ ఎలిమెంట్స్ కనెక్ట్ కావడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చి రంగంలోకి దిగాము. ముందుగా ఆది సాయి కుమార్ తో వేరే కథ అనుకున్నాం కానీ, ఇంతలో ఈ స్టోరీ రావడంతో ఆది సాయి కుమార్ తో ఈ సినిమా కంప్లీట్ చేశాము.

ఆది మార్కెట్ తెలుగులోనే కాకుండా హిందీలో కూడా మంచి డిమాండ్ ఉంటుంది, శంబాలాకు ఎలా ఉంది?

ఎస్, శంబాలాకు కూడా మంచి ఆఫర్స్ వచ్చాయి. హిందీ థియేట్రికల్ రిలీజ్ కూడా చేయడానికి ప్లాన్ చేశాము. తెలుగులో రిలీజ్ అయిన వారం రోజుల్లో శంబాలా హిందీ రిలీజ్ ఉంటుంది.

దర్శకుడిపై మీ అభిప్రాయం ఏంటి?

ఆయన షార్ట్ మేకింగ్, స్టోరీ టెల్లింగ్ చాలా బాగుంటుంది. ఇప్పటికే ఈ సినిమా థియేటర్ లో ఎలా ఉంటుందో చూశాము. చాలా బాగా వచ్చింది. మొదటి, రెండో షెడ్యూల్ తర్వాత చిత్ర బృందానికి చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. అన్ని ఎలిమెంట్స్ తో చాలా బాగా అవుట్ పుట్ ఇచ్చారు.

శ్రీ చరణ్ పాకాల సంగీతం గురించి ఏమంటారు?

శ్రీ చరణ్ పాకాల సంగీతం మా సినిమాకు పెద్ద అసెట్. విజువల్ తో పాటు మ్యూజిక్ బాగా వచ్చింది. ఈ జోనర్ కి బాగా సెట్ అయ్యారు.

శంబాలా టైటిల్ పెట్టడానికి రీజన్?

కల్కిలో వచ్చిన తరువాత శంబాలా అనేది అందరికీ తెలిసింది. శంబాలాకి ఓ మీనింగ్ ఉంది. శంబాలా ప్లేస్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి? అనేది ఈ సినిమాలో కనిపిస్తుంది.

అన్ని సినిమాల్లో శంబాలా సినిమా ఎందుకు ప్రత్యేకం?

మా సినిమాలో హారర్ తో పాటు సస్పెన్స్, ఎమోషన్స్ కలిపి ఉంటాయి. మైత్రి వాళ్ళు మా సినిమాను రిలీజ్ చేస్తున్నారు కాబట్టి అది కూడా పాజిటివ్. హీరో, హీరోయిన్స్ తో పాటు సినిమాలో అన్ని క్యారెక్టర్స్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది.

శంబాలా సినిమాకు సీక్వల్ ఉంటుందా?

ఫస్ట్ పార్ట్ అయితే ప్రాపర్ గా ఎండ్ చేశాము. సెకండ్ పార్ట్ కోసం స్మాల్ లీడ్ ఇచ్చాము. కొంచెం క్యూరియాసిటీ ఉండేలా క్లోజ్ చేశాము. దాని గురించి మళ్లీ ఆలోచిస్తాము.

OTT బిజినెస్ ఎలా ఉంది?

OTT, శాటిలైట్ రైట్స్ సినిమా రిలీజ్ కి ముందే క్లోజ్ అయ్యాయి. మా సినిమాకు మంచి డిమాండ్ వచ్చింది. మా సినిమా చూసి నచ్చి ఆహా వాళ్ళు శంబాలా ఓటీటీ రైట్స్ తీసుకున్నారు. థియేట్రికల్ రిలీజ్ కొంచెం చాలెంజింగ్ అనిపించింది. మైత్రి వాళ్ళు నైజాం రైట్స్ తీసుకున్నారు. ఏపీ, సీడెడ్ ఉషా పిక్చర్స్ వాళ్ళు తీసుకున్నారు.

మీ తర్వాతి సినిమాలు ఏంటి?

ప్రస్తుతం సెలెక్టెడ్ సినిమాలతో ముందుకెళ్తున్నాం. సినిమా డిస్ట్రిబ్యూషన్స్ కూడా కంటిన్యూ చేస్తున్నాం.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు