మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను దర్శకుడు అనిల్ రావిపూడి డైరెక్ట్ చేస్తుండగా స్టార్ బ్యూటీ నయనతార ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇక ఈ సినిమా తర్వాత చిరు తన నెక్స్ట్ చిత్రాన్ని బాబీ డైరెక్షన్‌లో చేయనున్నాడు. అయితే, మరో డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో చిరు ఇప్పటికే ఓ సినిమాను అనౌన్స్ చేసిన సంగతి తెలిసందే.
అయితే, ఈ సినిమా షూటింగ్ ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందంటూ అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. కాగా, ఈ సినిమాను 2026 ప్రధమార్థం తర్వాత ప్రారంభిస్తామని నిర్మాత సుధాకర్ చెరుకూరి ప్రకటించారు. ఈ సినిమాలో చిరుని ఇప్పటివరకు ఎవరూ చూపించని విధంగా శ్రీకాంత్ చూపిస్తాడని నిర్మాత తెలిపారు.
దీంతో శ్రీకాంత్ ఓదెల చిరంజీవిని ఎలా చూపిస్తాడా.. ఈ సినిమాతో చిరంజీవి బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాపై నిర్మాత తాజాగా రివీల్ చేయడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.


