లిటిల్ మిస్ & మిస్టర్ సౌత్ ఇండియా కర్టెన్ రైజర్.. డిసెంబర్ 27న ఫినాలే

లిటిల్ మిస్ & మిస్టర్ సౌత్ ఇండియా కర్టెన్ రైజర్.. డిసెంబర్ 27న ఫినాలే

Published on Dec 23, 2025 8:00 AM IST

Little Miss

దక్షిణ భారతదేశంలోని చిన్నారుల్లో దాగిన ప్రతిభను వెలికితీసేందుకు ‘ది లుక్స్ – మోడలింగ్ & యాక్టింగ్ అకాడమీ’ ఆధ్వర్యంలో ‘లిటిల్ మిస్ & మిస్టర్ సౌత్ ఇండియా’ పోటీలు జరగనున్నాయి. దీనికి సంబంధించిన కర్టెన్ రైజర్ వేడుక హైదరాబాద్‌లోని ప్రసాద్ ల్యాబ్స్‌లో శనివారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బిగ్ బాస్ ఫేమ్ కౌశల్ మాండ, విశిష్ట అతిథిగా ప్రముఖ యాంకర్ రవి హాజరై ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు.

ఈ పోటీల గ్రాండ్ ఫినాలే డిసెంబర్ 27న యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లోని శౌర్య కన్వెన్షన్ హాల్‌లో జరగనుంది. హైదరాబాద్‌తో పాటు విశాఖ, విజయవాడ, తిరుపతి నగరాల నుండి 3 ఏళ్ల నుంచి 19 ఏళ్ల లోపు బాలబాలికలు ఇందులో పాల్గొంటున్నారు. పోటీదారులకు గ్రూమింగ్, వ్యక్తిత్వ వికాసం, ర్యాంప్ వాక్ వంటి అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ సందర్భంగా కౌశల్ మాండ మాట్లాడుతూ.. ఇది కేవలం అందాల పోటీ మాత్రమే కాదని, పిల్లల్లో ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ పెంపొందించే వేదికని అన్నారు. పిల్లలు చిన్నవయసులోనే తమ శక్తిసామర్థ్యాలను గుర్తించేందుకు ఇలాంటి పోటీలు దోహదపడతాయని యాంకర్ రవి పేర్కొన్నారు. మహిళా డిజైనర్లను ప్రోత్సహించే ‘లిటిల్ ఇండియా ఫ్యాషన్ టైమ్స్’ (LIFT) కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం వహించింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు