ఇంటర్వ్యూ : హీరో అఖిల్ రాజ్ – ‘ఈషా’తో ఆడియన్స్‌కు థ్రిల్‌తో పాటు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్..!

ఇంటర్వ్యూ : హీరో అఖిల్ రాజ్ – ‘ఈషా’తో ఆడియన్స్‌కు థ్రిల్‌తో పాటు బెస్ట్ థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్..!

Published on Dec 24, 2025 1:02 AM IST

Akhil-Raj

రీసెంట్‌గా వచ్చిన ‘లిటిల్‌హార్ట్స్‌’, ‘రాజు వెడ్స్‌ రాంబాయి’ లాంటి సూపర్‌హిట్‌ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన బన్నీవాస్‌, వంశీ నందిపాటి ద్వయం తాజాగా ‘ఈషా’ పేరుతో ఓ హారర్‌ థ్రిల్లర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై వంశీ నందిపాటి, బన్నీ వాస్ గ్రాండ్‌గా ఈ చిత్రాన్నిడిసెంబరు 25న చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ రాజ్‌తో పాటు త్రిగుణ్‌ హీరోలుగా నటిస్తుండగా హెబ్బా పటేల్‌ కథానాయిక. సిరి హనుమంతు, బబ్లూ, పృథ్వీరాజ్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. శ్రీనివాస్‌ మన్నె దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో హీరో అఖిల్‌ రాజ్‌ విలేకరులతో ఈ చిత్ర విశేషాలను పంచుకున్నారు.

‘ఈషా’ కథ వినగానే మీకు ఎలా అనిపించింది?

ఈ కథ చెప్పగానే ఎంతో షాకింగ్‌గా అనిపించింది. నేను ఎంతో ఎంగేజ్‌ అయ్యాను. తప్పకుండా హారర్‌ థ్రిల్లర్‌ సినిమాలు చూసే వారికి కొత్త అనుభూతినిస్తుంది. సినిమాలో ట్విస్టులు, సౌండ్‌ డిజైనింగ్‌ సూపర్బ్. థియేట్రికల్‌ ఎక్స్‌పీరియన్ష్‌ ఇచ్చే సినిమా ఇది. ఈ సినిమా లైట్‌ ప్యాట్రాన్‌, విజువల్స్‌, సౌండ్‌ డిజైనింగ్‌ బాగుంటుంది. సినిమా కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇస్తుంది.

కథ వినగానే మీరు ఉలిక్కిపడ్డారా?

కథ చెప్పినప్పుడు నేను కూడా ఉలిక్కి పడ్డాను. ట్రైలర్‌ చూసినప్పుడు కూడా అదే ఫీలింగ్‌. లిటిల్‌హార్ట్స్‌, రాజు వెడ్స్‌ రాంబాయి సినిమాను విడుదల చేసిన వంశీ నందిపాటి, బన్నీవాస్‌ ఆ సినిమా విషయాల్లో ఎలా సక్సెస్‌ అయ్యారో ఈ సినిమా విషయంలో కూడా అంతే సక్సెస్‌ అవుతారని నమ్ముతున్నాను. తప్పకుండా అందర్ని భయపెట్టే సినిమా ఇది.

ఈ సినిమాలో మీ పాత్ర ఎలా ఉంటుంది?

వినయ్‌ అనే పాత్రను చేస్తున్నాను. నలుగురు చిన్నప్పటి స్నేహితుల్లో నేను ఒకర్ని. త్రిగుణ్‌, సిరి, హెబ్బా పటేల్‌, మైమ్‌ మధు వంటి మంచి నటులతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా నుంచి చాలా నేర్చుకున్నాను.

ఈ సినిమాకు ఎలాంటి హోమ్‌వర్క్‌ చేశారు?

ప్రతి ప్రాజెక్టును ఓన్‌ చేసుకోని చేస్తాను. ఈ సినిమా పట్ల కూడా అంతే నమ్మకంతో ఉన్నాను. నా వైపు నుంచి ఉన్న ప్రమోపన్ష్‌ కూడా చేస్తాను. ఫలితం ఆశించకుండా కష్టపడాలి. కంటెంట్‌ బాగున్న సినిమాను ఎవరూ ఆపలేరు.

హారర్‌ సినిమాను ఒప్పుకోవడానికి రీజన్‌ ఏమిటి?

వెర్సెటైల్‌ యాక్టర్‌గా అనిపించుకోవడం నాకు ఇష్టం. ఇన్ని రోజులు రాజు అనే పాత్రలో ఉన్నాను. ఇక ఆ పాత్ర నుంచి వినయ్‌ రోల్‌లో త్వరలో కనిపిస్తాను. ఈ పాత్రకు ఎలాంటి రెస్పాన్స్‌ వస్తుందో చూడాలి. కంప్లీట్‌ డిఫరెంట్‌ రోల్స్‌. హారర్‌ అంటే ఇమేజినేషన్‌ కేటగిరి. పర్‌ఫార్మెన్స్‌కు స్కోప్‌ ఎక్కువగా ఉంటుంది. సఖియా అనే వెబ్‌సీరిస్‌ సంబంధించి గ్లింప్స్‌ చూసి దర్శకుడు నన్ను ఎంపిక చేసుకున్నాడు. నాకు ఈ సినిమాతో ఓ గుర్తింపు వస్తుందనే నమ్మకం ఉంది, అందుకే ఈ సినిమాను ఒప్పుకున్నాను.

ప్రస్తుతం చేస్తున్న సినిమాలు?

నాలుగైదు ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయి. అన్‌సెట్స్‌లో తరుణ్‌భాస్కర్‌, అనుపమతో కలిసి ఓ సినిమా చేస్తున్నాను. భద్రి దర్శకుడు. రాజు వెడ్స్ రాంబాయి తరువాత చేస్తున్న సినిమా ఇది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు