యంగ్ హీరో హవీష్ మాస్ సినిమాల దర్శకుడు త్రినాథరావు నక్కిన కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం ‘నేను రెడీ’. క్రిస్మస్ ట్రీట్‌గా ఈ సినిమా నుంచి మేకర్స్ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హవీష్ క్లీన్-కట్ లుక్‌లో కనిపిస్తూ సినిమాపై అంచనాలను పెంచుతున్నారు.
ఈ కొత్త పోస్టర్‌లో హవీష్ నలుపు రంగు కళ్లద్దాలు, చక్కగా పెరిగిన గడ్డం, ఫార్మల్ డ్రెస్ ధరించి ఐడీ కార్డు మరియు ఆఫీస్ బ్యాగ్‌తో కనిపిస్తున్నారు. ఒక మిడిల్ క్లాస్ యువకుడి పాత్రను ఆయన పోషిస్తున్నట్లు ఈ లుక్ ద్వారా అర్థమవుతోంది. త్రినాథరావు నక్కిన మార్క్ వినోదం మరియు కమర్షియల్ అంశాలతో ఈ చిత్రం సాగనుందని చిత్ర యూనిట్ పేర్కొంది.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే హైదరాబాద్‌లో ఒక కీలక షెడ్యూల్ పూర్తికాగా, పాండిచ్చేరిలో ఒక పాట చిత్రీకరణను కూడా ముగించారు. నిఖిల కోనేరు నిర్మాణంలో హార్నిక్స్ ఇండియా ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తోంది.


