మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో “మన శంకర వరప్రసాద్ గారు” అనే ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతుంది. ఈ సినిమాలో మరో హీరో వెంకటేష్ కనిపించబోతున్న సంగతి తెలిసిందే. ఐతే, వెంకీ పాత్ర పై లేటెస్ట్ అప్ డేట్ వినిపిస్తోంది. నయనతార పాత్ర రెండో పెళ్లి చేసుకోవడానికి వచ్చే మరో హీరో పాత్రలో వెంకీ కనిపించబోతున్నాడని.. ఐతే, అప్పటికే వెంకీ – చిరు మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉండటం.. ఇది తెలియని నయనతార పాత్రతో వారిద్దరూ నడిపే డ్రామా చాలా బాగా ఆకట్టుకుంటుందని తెలుస్తోంది.
కాగా 2026 సంక్రాంతికి ఈ సినిమాని తీసుకురానున్నారు. అన్నట్టు 25 ఏళ్ల క్రితం చిరంజీవి ఎంత స్లిమ్‌గా, అందంగా ఉన్నారో ఈ సినిమాలో అలానే ఉన్నారు. మరి ఫ్యాన్స్ ను ఈ సినిమా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇక సాహు గారపాటి, సుస్మిత (చిరంజీవి కుమార్తె) సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కాగా ఈ సినిమా గురించి మెగాస్టార్ ఆ మధ్య మాట్లాడుతూ.. ‘ఈ సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక చిత్రమని.. ఈ మూవీ కథ తనకు బాగా నచ్చిందని చెప్పారు.


