పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి కాన్సెప్ట్ వీడియో రిలీజ్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ నుంచి కాన్సెప్ట్ వీడియో రిలీజ్.. కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్

Published on Jan 6, 2026 9:01 PM IST

Pawan-Kalyan

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) గతేడాది ‘దే కాల్ హిమ్ OG’ అనే గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామాతో ప్రేక్షకులను అలరించారు. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా 2025లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా నిలిచింది. అయితే, పవన్ కళ్యాణ్‌కు ‘పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) క్రియేటివ్ వర్క్స్’ అనే నిర్మాణ సంస్థ ఉన్న విషయం తెలిసిందే.

ఇటీవల ఈ బ్యానర్ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఓ భారీ అప్డేట్ ఉంటుందని అభిమానులకు టీజ్ చేసింది. చెప్పినట్లే కొద్దిసేపటి క్రితం ఒక కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో మార్షల్ ఆర్ట్స్ అంశాలు, జపాన్ మార్షల్ ఆర్ట్స్ సంస్కృతి ప్రభావం స్పష్టంగా కనిపించాయి.

అయితే ఈ కాన్సెప్ట్ వీడియో అసలు ఏ ప్రాజెక్ట్‌కు సంబంధించినదో స్పష్టత ఇవ్వకపోవడంతో అభిమానుల్లో గందరగోళం నెలకొంది. ఈ వీడియో వెనుక నిర్మాణ సంస్థ ఏం ప్లాన్ చేస్తుందో వేచి చూడాల్సిందే. ఇక నటుడిగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తదుపరి చిత్రం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సమ్మర్ 2026లో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు