తేజస్ గుంజల్ ఫిలిమ్స్, రోహిత్ గుంజల్ ఫిలిమ్స్ బ్యానర్లపై తెరకెక్కిన యాక్షన్ క్రైమ్ డ్రామా ‘వన్ బై ఫోర్’ (One/4). వెంకటేష్ పెద్దపాలెం, అపర్ణ మల్లిక్, హీనా సోని ప్రధాన పాత్రల్లో నటించారు. ‘బాహుబలి’ చిత్రానికి అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన పళని కె ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 200 థియేటర్లలో జనవరి 30న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఒక సందర్భంలో మాట జారితే (tongue slip) ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురవుతాయనే ఆసక్తికరమైన పాయింట్‌తో ఈ సినిమాను తీర్చిదిద్దారు. రంజన రాజేష్ గుంజల్, రోహిత్ రాందాస్ గుంజల్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో యాక్షన్ ఎపిసోడ్స్, సుభాష్ ఆనంద్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని మేకర్స్ తెలిపారు.
దర్శకుడు పళని టేకింగ్ రాజమౌళి శైలిలో ఉంటుందని, ఒక్క ఫ్రేమ్ కూడా బోర్ కొట్టకుండా సినిమా సాగుతుందని చిత్ర బృందం పేర్కొంది. సాగర్ మాస్టర్ కొరియోగ్రఫీ, నటీనటుల పనితీరు ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ చిత్రంలో టెంపర్ వంశీ, ఆర్ ఎక్స్ 100 కరణ్, నరేంద్ర వర్మ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.


