మహేష్ చేతుల మీదుగా ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్.. ఎప్పుడంటే?

మహేష్ చేతుల మీదుగా ‘శ్రీనివాస మంగాపురం’ ఫస్ట్ లుక్.. ఎప్పుడంటే?

Published on Jan 9, 2026 4:02 PM IST

Mahesh Babu

సూపర్ స్టార్ కృష్ణ మనవడు, దివంగత రమేష్ బాబు కుమారుడైన జయకృష్ణ ఘట్టమనేని వెండితెరకు పరిచయం అవుతూ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ఈ చిత్రాన్ని దర్శకుడు అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తుండటంతో ఈ మూవీపై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇక ఈ సినిమాలోని తన పాత్ర కోసం కఠినంగా సిద్ధమవుతూ ప్రస్తుతం షూటింగ్‌లో పాల్గొంటున్నాడు జయకృష్ణ. కాగా ఈ సినిమాలో రవీనా టండన్ కుమార్తె రాషా తడానీ హీరోయిన్‌గా నటిస్తూ టాలీవుడ్‌లో అడుగుపెడుతోంది. పి.కిరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ అధినేత అశ్వినీ దత్ సమర్పిస్తున్నారు.

కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు. జనవరి 10న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సూపర్ స్టార్ మహేష్ బాబు లాంచ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. జనవరి 10న ఉదయం 10.30 గంటలకు మహేష్ చేతుల మీదుగా ఈ మూవీ ఫస్ట్ లుక్ రానుంది.

జి వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడగా, ఫస్ట్ లుక్‌తో పాటు తదుపరి అప్‌డేట్స్ త్వరలోనే రానున్నాయని చిత్ర బృందం వెల్లడించింది.

తాజా వార్తలు