నేచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘ద ప్యారడైజ్’ పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే, షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో, గతంలో ప్రకటించిన మార్చి 26 విడుదల తేదీ మారే అవకాశం ఉంది. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం 2026 జూన్ 25న థియేటర్లలోకి వచ్చే ఛాన్స్ ఉంది.
ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాలో నాని సరసన కయాదు లోహర్ నటిస్తుండగా.. మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఎస్‌ఎల్‌వి సినిమాస్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ కొత్త రిలీజ్ డేట్‌పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.


