రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘ది రాజా సాబ్’ నేడు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్ అయింది. దర్శకుడు మారుతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాకు మిక్సిడ్ రెస్పాన్స్ దక్కుతోంది. అయితే, ఈ సినిమా బాలీవుడ్‌లో వచ్చిన ఓ సినిమాను పోలి ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనిపై మేకర్స్ క్లారిటీ ఇచ్చా.
బాలీవుడ్‌లో హీరో అక్షయ్ కుమార్ నటించిన ‘భూల్ భులయ్యా’ తరహాలో ‘రాజా సాబ్’ ఉందా అనే కామెంట్స్‌పై నిర్మాత టీజీ. విశ్వప్రసాద్ స్పందిస్తూ.. “ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్‌ను దృష్టిలో పెట్టుకుని మేం ఈ ఫాంటసీ ప్రపంచాన్ని డిజైన్ చేశాం. అందుకే విజువల్ ఎలిమెంట్స్‌లోనూ, బ్యాక్‌డ్రాప్ కథలోనూ ఈ సినిమా పూర్తిగా భిన్నంగా ఉంటుంది” అని స్పష్టం చేశారు.
ఇక ఈ విషయంపై హీరోయిన్ రిద్ధి కుమార్ కూడా తన అభిప్రాయాన్ని వెల్లడించారు. “భూల్ భులయ్యా అద్భుతమైన సినిమా, నాకు చాలా ఇష్టం. కానీ అది పూర్తిగా రియలిస్టిక్‌గా, నిజమైన పరిస్థితుల్లో సాగుతుంది. ఒక నిజమైన మహల్, నిజమైన మనుషులు, నిజ జీవితానికి దగ్గరగా కథ నడుస్తుంది. ది రాజా సాబ్ లో కూడా సైకాలజికల్ టచ్ ఉంటుంది. అయితే ఇది పూర్తిగా ఫాంటసీ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. ఫాంటసీ అంటే ఇంతకుముందు ఎప్పుడూ చూడని కొత్త అనుభూతిని సృష్టించడమే” అని ఆమె తెలిపారు. నిధి అగర్వాల్ కూడా ఈ కామెంట్స్‌పై స్పందించింది. మొత్తానికి కాపీ అనే కామెంట్స్‌కు చిత్ర యూనిట్ నుంచి క్లారిటీ అయితే వచ్చింది.


