సంక్రాంతి సినిమాలు ఓకే.. థియేటర్లు ఎక్కడ…?

సంక్రాంతి సినిమాలు ఓకే.. థియేటర్లు ఎక్కడ…?

Published on Jan 15, 2026 1:00 AM IST

Sankranthi

సంక్రాంతి పండుగ బరిలో ఈసారి ఐదు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ప్రభాస్ నటించిన “ది రాజా సాబ్”, మెగాస్టార్ చిరంజీవి “మన శంకర వరప్రసాద్ గారు”, రవితేజ “భర్త మహాశయులకు విజ్ఞప్తి”, నవీన్ పొలిశెట్టి “అనగనగా ఒక రాజు”, శర్వానంద్ “నారీ నారీ నడుమ మురారి” ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అయితే రాజా సాబ్ నిరాశపరిచే టాక్‌తో వసూళ్లలో తగ్గుదల చూపుతోంది. దీనికి భిన్నంగా చిరంజీవి సినిమా గ్రాండ్ ఓపెనింగ్‌తో భారీ కలెక్షన్లు సాధిస్తూ సంక్రాంతి రేస్‌లో ముందంజలో ఉంది. మొదటి రెండు రోజులు ఈ చిత్రానికే ఎక్కువ స్క్రీన్లు కేటాయించడంతో ట్రేడ్‌లో సానుకూల వాతావరణం కనిపిస్తోంది.

రవితేజ నటించిన “భర్త మహాశయులకు విజ్ఞప్తి”కు డీసెంట్ స్పందన లభించడంతో సంతృప్తికరంగా నడుస్తోంది. ఇక తాజాగా విడుదలైన “అనగనగా ఒక రాజు”, “నారీ నారీ నడుమ మురారి” చిత్రాలకు మాత్రం స్క్రీన్ల సమస్య తప్పడం లేదు. మరోవైపు పండుగ సీజన్‌లో రాజా సాబ్ సరైన సంఖ్యలో థియేటర్లు నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. “మన శంకరవర ప్రసాద్ గారు”కు అన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు పడుతుండటంతో కొత్త స్క్రీన్లు అందుబాటులో లేక, ఎర్లీ మార్నింగ్ షోలు కూడా వేస్తున్నారు.

అనగనగా ఒక రాజు సినిమాకు మంచి టాక్ రావడంతో మొదటి నుంచే ప్యాక్డ్ హౌస్‌లు కనిపిస్తున్నాయి. అయినా అదనపు షోలు, స్క్రీన్లు దొరకడం లేదు. అదే విధంగా “నారీ నారీ నడుమ మురారి” కూడా మరిన్ని థియేటర్లు కోరుతోంది. ఈ ఐదు సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ షోలు, స్క్రీన్లు కేటాయించడం వచ్చే కొన్ని రోజులు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు పెద్ద పరీక్షగా మారనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు