మన టాలీవుడ్ స్టార్ ఎంటర్టైనర్ నవీన్ పొలిశెట్టి హీరోగా మీనాక్షి చౌదరి హీరోయిన్ గా దర్శకుడు మారి తెరకెక్కించిన సాలిడ్ ఎంటర్టైనర్ చిత్రం “అనగనగా ఒక రాజు”(Anaganaga Oka Raju). నిజానికి ఎపుడో అనౌన్స్ అయ్యిన ఈ సినిమా లేట్ అయినప్పటికీ లేటెస్ట్ గా సాలిడ్ ఓపెనింగ్స్ ని రాబట్టే విధంగా వచ్చింది. నవీన్ కెరీర్ లోనే హైయెస్ట్ బుకింగ్స్ తో స్టార్ట్ అయ్యిన ఈ సినిమా నైజాం మార్కెట్ లో సాలిడ్ స్టార్ట్ ని అందుకున్నట్టు పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి.
వీటి ప్రకారం నిన్న డే 1 కి గాను 1.4 కోట్ల షేర్ ని ఈ సినిమా రాబట్టిందట. అది కూడా జి ఎస్ టి కాకుండా ఈ సినిమా అందుకున్నట్టు తెలుస్తుంది. దీనితో పండుగలో ఈ సినిమాకి కూడా మంచి ఆదరణ జనం అందిస్తున్నారని చెప్పవచ్చు. ఇక ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందించగా సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ మరియు శ్రీకర సినిమాస్ వారు నిర్మాణం వహించారు.


