అనగనగా ఒక రాజు ర్యాంపేజ్.. ఆ మార్క్‌కు మరింత చేరువ..!

అనగనగా ఒక రాజు ర్యాంపేజ్.. ఆ మార్క్‌కు మరింత చేరువ..!

Published on Jan 17, 2026 10:01 PM IST

Anaganaga Oka Raju

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’(Anaganaga Oka Raju) సినిమా సంక్రాంతి బరిలో రిలీజ్ అయి మంచి టాక్‌తో దూసుకెళ్తోంది. ఈ సినిమాను దర్శకుడు మారి పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించగా నవీన్ తనదైన పర్ఫార్మెన్స్‌తో థియేటర్లలో నవ్వులు పూయించాడు.

ఇక ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లు వస్తున్నాయి. ముఖ్యంగా అమెరికాలో ఈ చిత్రం 850K డాలర్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ కలెక్షన్స్ మరింత పెరగడం ఖాయమని.. త్వరలోనే 1 మిలియన్ డాలర్ల మార్క్‌ను టచ్ చేయడం ఖాయమని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.

ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించగా మిక్కీ జే మేయర్ సంగీతం అందించారు. నాగవంశీ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశారు.

తాజా వార్తలు