టాలీవుడ్‌లో ఆ హీరో అంటే ఇష్టమంటున్న ‘ధురంధర్’ భామ

టాలీవుడ్‌లో ఆ హీరో అంటే ఇష్టమంటున్న ‘ధురంధర్’ భామ

Published on Jan 17, 2026 11:01 PM IST

Sara Arjun

బాలీవుడ్‌లో తెరకెక్కిన ‘ధురంధర్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సారా అర్జున్ ఇప్పుడు ఆసక్తికరమైన ప్రాజెక్టులతో ముందుకెళ్తోంది. యంగ్ టాలెంట్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఆమె, కెరీర్ ప్రారంభ దశలోనే మంచి అవకాశాలు దక్కించుకుంటూ ఇండస్ట్రీలో ప్రత్యేక స్థానం సంపాదిస్తోంది.

ప్రస్తుతం సారా చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘యుఫోరియా’, గౌతమ్ తిన్ననూరి తెరకెక్కిస్తున్న ‘మ్యాజిక్’ చిత్రాల్లో ఆమె కీలక పాత్రలు పోషిస్తోంది. పేరున్న దర్శకులు కావడంతో ఈ రెండు ప్రాజెక్టులపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

ఇక తాజాగా ‘యుఫోరియా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న సారా తన అభిమాన హీరో గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. విజయ్ దేవరకొండ తనకు అత్యంత ఇష్టమైన నటుడని ఆమె చెప్పడంతో సోషల్ మీడియాలో ఆమె చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో తన అభిమాన హీరోతో ఈ భామ ఏదైనా సినిమా చేస్తుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు