గత ఏడాది కంటే ఈ ఏడాదిలో మన తెలుగు సినిమా నుంచి భారీ సినిమాలు ఒకదాని తర్వాత ఒకటి రానున్నాయి. ఆల్రెడీ సంక్రాంతికి మెగాస్టార్ బొమ్మ వచ్చి బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇక నెక్స్ట్ మార్చ్ నుంచే మళ్ళీ భారీ సినిమాల హంగామా మొదలు కానుంది. అయితే ఈ మార్చ్ లో ఎప్పుడో కన్ఫర్మ్ అయ్యి ఉన్న పెద్ది, ప్యారడైజ్ లాంటి సినిమాలు లాక్ అయ్యి ఉన్నాయి కానీ ఇప్పుడు ఈ రెండూ అనుకున్న సమయానికి వచ్చే ఛాన్స్ లు తక్కువే ఉన్నట్టుగా రూమర్స్ వినిపిస్తున్నాయి.
దీనితో ఈ గ్యాప్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) దిగనుంది అని ఆల్రెడీ టాక్ మొదలైంది. మరి రామ్ చరణ్ పెద్ది, నాని ప్యారడైజ్ చిత్రాలు ఎప్పుడు విడుదలకి ప్లాన్ చేస్తున్నారు అనేది కూడా సినీ వర్గాల్లో వినిపిస్తుంది. దీని ప్రకారం, ఈ రెండు సినిమాల్లో పెద్ది మే నెలకి షిఫ్ట్ కాగా నాని సినిమా మాత్రం జూన్ లోకి మారినట్టు తెలుస్తుంది. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. అలాగే ఉస్తాద్ భగత్ సింగ్ (Ustaad Bhagat Singh) రిలీజ్ డేట్ పై అభిమానులు ఓ క్లారిటీ కోరుకుంటున్నారు.


