మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ చిత్రం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ర్యాంపేజ్ కంటిన్యూ చేస్తోంది. ఈ సినిమా రిలీజ్ అయ్యి పదిహేను రోజులు దాటినా కూడా ఈ చిత్రాన్ని చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ మరోసారి తన స్టామినా చూపించడంతో అభిమానులు ఫుల్ ఖుషీ చేసుకుంటున్నారు.
ఇక ఈ సినిమా కలెక్షన్స్ పరంగా కూడా సాలిడ్ వసూళ్లు రాబడుతోంది. అయితే, ప్రముఖ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షోలో ‘మన శంకర వరప్రసాద్ గారు’ అదిరిపోయే విధంగా టికెట్ బుకింగ్స్‌తో దూసుకుపోతుంది. ఈ చిత్రం ఇప్పటివరకు ఏకంగా 3.6 మిలియన్‌కు పైగా టికెట్ బుకింగ్స్ జరుపుకున్నట్లు బుక్ మై షో వెల్లడించింది. ఓ ప్రాంతీయ చిత్రానికి ఈ రేంజ్‌లో టికెట్ బుకింగ్స్ జరగడం ఆల్‌టైమ్ రికార్డు అని ప్రకటించారు.
ఇది కేవలం చిరంజీవి వల్లే సాధ్యమని అభిమానులు గర్వంగా చెబుతున్నారు. అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో స్టార్ బ్యూటీ నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్‌లో కనిపించారు. భీమ్స్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మాతలు.


