రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పీరియాడిక్ చిత్రం VD14 అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి రిపబ్లిక్ డే సందర్భంగా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు.
ఈ చిత్రంలో 1876 కాలం నాటి పరిస్థితులను మనకు చూపెట్టబోతున్నారు. ఆ సమయంలో బ్రిటిష్ వారు భారతీయులపై చేస్తున్న అకృత్యాలను ఓ యోధుడు ఎలా ఎదురించాడు అనే నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. రణబాలి అనే పవర్‌ఫుల్ పాత్రలో విజయ్ దేవరకొండ ఈ సినిమాలో కనిపిస్తున్నాడు. ఇక బ్రిటిష్ వారిని అతడు ఏ విధంగా ఎదురించి పోరాటం చేశాడు అనేది మనకు ఈ సినిమాలో చూపించబోతున్నాడు దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్.
ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న జయమ్మ అనే పాత్రలో నటిస్తుండగా హాలీవుడ్ మూవీ ‘మమ్మీ’ చిత్రంలో విలన్‌గా నటించిన ఆర్నాల్డ్ వోస్లూ ఈ సినిమాలో బ్రిటిష్ అధికారిగా తన క్రూరత్వాన్ని చూపించబోతున్నాడు. ఇక ఈ సినిమాకు బాలీవుడ్ ద్వయం అజయ్-అతుల్ సంగీతం అందిస్తుండగా మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ చిత్రాన్ని 2026 సెప్టెంబర్ 11న వరల్డ్‌వైడ్‌గా గ్రాండ్ రిలీజ్ చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


