క్లైమాక్స్ నచ్చకుండానే సినిమా చేశా – తరుణ్ భాస్కర్

క్లైమాక్స్ నచ్చకుండానే సినిమా చేశా – తరుణ్ భాస్కర్

Published on Jan 27, 2026 12:14 AM IST

Tharun Bhascker

డైరెక్టర్ నుంచి యాక్టర్‌గా మారిన తరుణ్ భాస్కర్ (Tharun Bhascker ), అందాల భామ ఈషా రెబ్బా ప్రధాన పాత్రల్లో నటించిన ‘ఓం శాంతి శాంతి శాంతిః’ చిత్రం ఈ నెల 30న థియేటర్లలో విడుదలకు సిద్ధంగా ఉంది. మలయాళంలో సంచలన విజయం సాధించిన ‘జయ జయ జయ జయ హే’ చిత్రానికి రీమేక్‌గా వస్తున్న ఈ సినిమాకు ఏఆర్ సజీవ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్ర ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ను మేకర్స్ ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలో తరుణ్ భాస్కర్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

మలయాళ వెర్షన్‌తో పోలిస్తే తెలుగు వెర్షన్‌లో క్లైమాక్స్‌ను మార్చినట్లు తరుణ్ తెలిపారు. “మేము క్లైమాక్స్‌ను మార్చాం. ఇది చాలా చర్చనీయాంశంగా ఉంటుంది. వ్యక్తిగతంగా ఆ క్లైమాక్స్ నాకు నచ్చకపోయినా, దర్శకుడి ఆలోచనను గౌరవిస్తూ ఆ సన్నివేశాల్లో నటించాను” అని తరుణ్ భాస్కర్ పేర్కొన్నారు. రీమేక్ చిత్రమైనప్పటికీ తెలుగు ప్రేక్షకులకు తగ్గట్టుగా చేసిన ఈ మార్పు ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.

ఈ చిత్రంలో విలక్షణ నటుడు బ్రహ్మాజీ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. సృజన్ ఎరబోలు, ఆదిత్య పిట్టి, వివేక్ కృష్ణాని, అనుప్ చంద్రశేఖరన్, సాదిక్ షేక్ మరియు నవీన్ శనివారపు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. జై క్రిష్ సంగీతాన్ని అందించిన ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి.

తాజా వార్తలు