ప్రస్తుతం మన టాలీవుడ్ లో పలు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ ల తాలూకా రిలీజ్ డేట్ లు ఎలా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం. ఎప్పుడో అనౌన్స్ చేసిన ఈ సినిమాలు కూడా ఇప్పుడు ఆన్ టైం వచ్చే పరిస్థితులు లేవు. ఇందులో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఇప్పుడు నటిస్తున్న చిత్రం పెద్ది(Peddi) కూడా ఒకటి. ఈ సినిమా మార్చ్ నుంచి మే, ఇప్పుడు మే నుంచి దసరా సీజన్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
ఒకవేళ ఈ సినిమా మే నెల నుంచి కూడా తప్పుకుంటే మాత్రం ఆ టైం లో మెగాస్టార్ ‘విశ్వంభర'(Vishwambhara)కి మంచి స్కోప్ ఉండొచ్చు. పైగా మే నెలలోనే మెగాస్టార్ నుంచి పలు భారీ హిట్ చిత్రాలు కూడా ఉన్నాయి. సో సెంటిమెంట్ ప్రకారం కూడా విశ్వంభర మే నెల రిలీజ్ కి పాజిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ప్రస్తుతం ఈ సినిమా వి ఎఫ్ ఎక్స్ అవుట్ పుట్ పైనే అందరి కళ్ళు ఉన్నాయి. మేకర్స్ అయ్యితే ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా బెస్ట్ క్వాలిటీ అందించే పనిలో ఉన్నారు. సో విశ్వంభర మే రిలీజ్ ని ఆక్యుపై చేస్తుందా లేదా అనేది వేచి చూడాల్సిందే.


