మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ఆకాశంలో ఒక తార’ ఇప్పటికే ప్రేక్షకుల్లో సాలిడ్ అంచనాలు క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు పవన్ సాదినేని డైరెక్ట్ చేస్తుండగా వైవిధ్యమైన కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ ఈ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేశాయి.
ఈ సినిమాలో దుల్కర్ సల్మాన్ సరసన కొత్త హీరోయిన్ సాత్విక వీరవల్లి పరిచయం అవుతోంది. అయితే, ఈ సినిమాలో స్టార్ బ్యూటీ శ్రుతి హాసన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తోంది. నేడు(జనవరి 28) శ్రుతి పుట్టినరోజు కానుకగా ఆమెకు సంబంధించిన పోస్టర్‌తో ఈ సినిమాలో ఆమె నటిస్తుందనే విషయాన్ని మేకర్స్ రివీల్ చేశారు. ఈ సినిమాలో ఆమె బోల్డ్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాకు జి.వి.ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తుండగా.. స్వప్న సినిమాస్, గీతా ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి. దీంతో ఈ సినిమాలో ఇంకా ఎలాంటి సర్‌ప్రైజ్‌లు ఉన్నాయా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.


