ఇప్పుడు ఇండియన్ సినిమా దగ్గర మోస్ట్ అవైటెడ్ గా ఎదురు చూస్తున్న పలు క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ అలాగే సెన్సేషనల్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కలయికలో చేయాల్సి ఉన్న చిత్రం సలార్ 2 కూడా ఒకటి. మాస్ అండ్ ప్రభాస్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కూడా ఇదే అని చెప్పడంలో సందేహం లేదు. అయితే ఈ సినిమాపై వచ్చిన రూమర్స్ ని మేకర్స్ బ్రేక్ చేస్తున్నారు.
ఇక లేటెస్ట్ గా శృతి హాసన్ బర్త్ డే సందర్భంగా ముందు ఓ బర్త్ డే పోస్టర్ వదిలారు. ఈ తర్వాత ప్రభాస్ తో కలిసి ఉన్న పిక్ ని షేర్ చేసి బ్యూటిఫుల్ ఫోటో మూమెంట్ గా వదిలారు. ఇందులో శృతి హాసన్ తన మొబైల్ లో ప్రభాస్ కి సలార్ 2 లో తనకి ఏం జరిగిందో చూపిస్తుంది అంటూ రివీల్ చేశారు. దీనితో సలార్ 2 పై మరో అప్డేట్ అందించారు. ఇలా ప్రస్తుతం ఫ్యాన్స్ లో ఈ పిక్ వైరల్ గా మారింది. మరి పార్ట్ 2 షూట్ ఎప్పుడు మొదలవుతుందో చూడాలి.


