ఆ టాప్ బ్యానర్ తో పవన్ సినిమా? నిజమేనా?

ఆ టాప్ బ్యానర్ తో పవన్ సినిమా? నిజమేనా?

Published on Jan 29, 2026 10:15 AM IST

pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఇప్పుడు నటించిన అవైటెడ్ మాస్ చిత్రమే ఉస్తాద్ భగత్ సింగ్. తన బ్లాక్ బస్టర్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ పెట్టే విధంగా సిద్ధం అవుతుంది. ఇక ఈ సినిమా తర్వాత దర్శకుడు సురేందర్ రెడ్డితో ఓ సినిమా సుజీత్ తో ఓజి 2 లు లాక్ అయ్యి ఉన్నాయి. ఇంకా పలు నిర్మాణ సంస్థల దగ్గర పవన్ డేట్స్ ఉన్నాయి. అయితే ఈ లిస్ట్ లో ఒక టాప్ బ్యానర్ కూడా చేరినట్టు కొన్ని ఊహాగానాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

మరి వారు ఎవరో కాదు యూవీ క్రియేషన్స్ వారట. ఆల్రెడీ మెగాస్టార్ చిరంజీవితో ఇప్పుడు విశ్వంభర అనే భారీ సినిమా చేస్తున్నారు. గతంలో రామ్ చరణ్ తో కూడా ఓ సినిమా చేయాల్సి ఉంది. కానీ అది కుదరలేదు. అయితే ఇప్పుడు పవన్ తో సినిమా ఉంటుంది అన్నట్టు మొదలైన ఈ టాక్ లో ఎంతవరకు నిజం ఉంది అనేది చూడాలి. ప్రస్తుతం పవన్ అయితే ఏ సినిమా షూటింగ్ లోని పాల్గొనడం లేదు. సో ఈ ఇంట్రెస్టింగ్ కలయికపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది.

తాజా వార్తలు