మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు మన శంకర వర ప్రసాద్ గారు అనే సెన్సేషనల్ విజయాన్ని సొంతం చేసుకొని టాలీవుడ్ రీజనల్ ఇండస్ట్రీ హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా తర్వాత దీని కంటే ముందే మొదలై ఇప్పటికీ పెండింగ్ లో ఉన్న భారీ చిత్రం “విశ్వంభర” విడుదల కావాల్సి ఉంది. అయితే ఈ సినిమా భారీ ఫాంటసీ సినిమాగా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించడం జరిగింది. ఇక ఈ సినిమా రిలీజ్ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఫైనల్ గా బిగ్ అప్డేట్ లీక్ అయ్యింది.
మెగాస్టార్ రీసెంట్ మీడియా ఇంటరాక్షన్ లో విశ్వంభర రిలీజ్ పై ఓ క్లారిటీ ఇచ్చేసారు. ఈ సినిమా జూన్ లేదా జూలై ఉంటుంది అని ఖరారు చేశారు. అంతే కాకుండా దాదాపు అయితే జూలై 9న అలా ఉండొచ్చని హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. సో విశ్వంభర రిలీజ్ క్లారిటీ కోసం చూస్తున్న ఫ్యాన్స్ కి ఇదో బిగ్ అప్డేట్ అని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాకి ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తుండగా యూవీ క్రియేషన్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు.


