‘ధురంధర్’ ఓటిటి రిలీజ్ పై సస్పెన్స్!

‘ధురంధర్’ ఓటిటి రిలీజ్ పై సస్పెన్స్!

Published on Jan 29, 2026 9:00 AM IST

Dhurandhar

ప్రస్తుతం ఇండియన్ సినిమా దగ్గర సింగిల్ లాంగ్వేజ్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రం ఏదన్నా ఉంది అంటే అది ధురంధర్(Dhurandhar) అనే చెప్పాలి. టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ హీరోగా దర్శకుడు ఆదిత్య ధర్ కాంబినేషన్ లో చేసిన ఈ సెన్సేషనల్ హిట్ ఇప్పటికీ మంచి వసూళ్లు రాబడుతుంది. అయితే థియేటర్స్ లో సంచలనం సెట్ చేసిన ఈ సినిమా ఓటిటి రిలీజ్ కోసం అభిమానులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

అయితే రేపు జనవరి 30నే ఈ సినిమా వస్తుందని భావిస్తున్నారు కానీ ఈ సినిమాపై స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు వరకు ఎలాంటి అప్డేట్ ని పొందుపరచలేదు. కనీసం తమ యాప్ లో కూడా రాబోతున్న సినిమాల లిస్ట్ లో సెట్ చెయ్యలేదు. అయితే బాలీవుడ్ వర్గాల్లో టాక్ ప్రకారం సినిమా ఓటిటి ప్రోమోలు కూడా సిద్ధం అవుతున్నాయంటున్నారు. సో దీనిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం మాత్రం అంతా ఈ సినిమా ఓటిటి అప్డేట్ కోసమే ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు