డ్రాప్ అయ్యిన ‘బోర్డర్ 2’ వసూళ్లు.. 6 రోజుల్లో ఎంతంటే!

డ్రాప్ అయ్యిన ‘బోర్డర్ 2’ వసూళ్లు.. 6 రోజుల్లో ఎంతంటే!

Published on Jan 29, 2026 12:38 PM IST

Border 2

రీసెంట్ గా బాలీవుడ్ సినిమా దగ్గర రిలీజ్ అయ్యిన లేటెస్ట్ చిత్రాల్లో స్టార్ నటుడు సన్నీ డియోల్ (Sunny Deol) హీరోగా దర్శకుడు అనురాగ్ సింగ్ తెరకెక్కించిన ఈ వార్ నేపథ్యం డ్రామా ‘బోర్డర్ 2’ భారీ ఓపెనింగ్స్ సాధించింది. అంతే కాకుండా లాంగ్ వీకెండ్ లో భారీ వసూళ్లు సాధించి బాలీవుడ్ లో మరో ఫాస్టెస్ట్ 200 కోట్ల సినిమాగా కూడా నిలిచింది.

అయితే ఆ లాంగ్ వీకెండ్ హాలిడేస్ తర్వాత వీక్ డేస్ కి ఈ సినిమా అడుగు పెట్టింది. అయితే ఇక్కడ నుంచి మాత్రం సినిమాకి కొంచెం వసూళ్లు డ్రాప్ అవుతూ వస్తున్నాయి. మొన్న మంగళవారం నుంచి నిన్న బుధవారం వరకు కూడా క్రమంగా వసూళ్లు తగ్గుతున్నాయి.

ఐదవ రోజు 23 కోట్లకి పైగా నెట్ వసూళ్లు సాధించిన ఈ సినిమా ఆరవ రోజు మాత్రం 15 కోట్లకి పైగా మాత్రమే రాబట్టింది. దీనితో డ్రాప్ ని క్లియర్ గా గమనించవచ్చు. ఇలా మొత్తం 6 రోజుల్లో ఈ సినిమా ఇండియా వైడ్ గా 231.83 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టినట్టు బాలీవుడ్ పి ఆర్ వర్గాలు చెబుతున్నాయి. సో ఫుల్ రన్ లో సినిమా ఎక్కడ వరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.

తాజా వార్తలు