మెగా కపుల్‌కు అల్లు అర్జున్ విషెస్.. సంతోషం డబుల్ అయ్యిందంటూ పోస్ట్..!

మెగా కపుల్‌కు అల్లు అర్జున్ విషెస్.. సంతోషం డబుల్ అయ్యిందంటూ పోస్ట్..!

Published on Feb 2, 2026 2:11 PM IST

Allu Arjun

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన మరోసారి తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. మెగాస్టార్ ఇంట ఈసారి డబుల్ సంతోషం వెల్లివిరిసింది. చరణ్-ఉపాసన జోడీకి ఓ మగ బిడ్డ, ఆడ బిడ్డ జన్మించారు. దీంతో మెగా ఫ్యామిలీ సంతోషంతో ఉప్పొంగిపోతుంది. అటు అభిమానులు సైతం మెగా ఫ్యామిలీకి అభినందనలు తెలుపుతూ సందడి చేస్తున్నారు.

అయితే, తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) కూడా ఈ మెగా జోడికి తన విషెస్ అందించాడు. ఆయన తాజాగా తన సోషల్ మీడియాలో రామ్ చరణ్, ఉపాసనలకు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశాడు. మరోసారి తల్లిదండ్రులుగా మారి తమ ఫ్యామిలీలో సంతోషం నింపారని.. తాతగా చిరంజీవి ముఖంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనిపిస్తుందని అల్లు అర్జున్ (Allu Arjun) ట్వీట్ చేశాడు.

ఇక అల్లు అర్జున్ (Allu Arjun) చేసిన పోస్ట్‌తో మెగా ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగా ఫ్యామిలీలో ప్రస్తుతం పండుగ వాతావరణం నెలకొందని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

తాజా వార్తలు