విజయవాడ నుంచి ‘త్రిముఖ’ సక్సెస్ టూర్ షురూ.. వివరాలు వెల్లడించిన చిత్ర యూనిట్

విజయవాడ నుంచి ‘త్రిముఖ’ సక్సెస్ టూర్ షురూ.. వివరాలు వెల్లడించిన చిత్ర యూనిట్

Published on Feb 3, 2026 4:45 PM IST

Trimukha

విజయవాడ వేదికగా ‘త్రిముఖ’ చిత్ర యూనిట్ విజయోత్సవ యాత్ర (సక్సెస్ టూర్)ను ప్రారంభించింది. జనవరి 30న విడుదలైన తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని, మౌత్ టాక్ బాగుందని చిత్రబృందం ఆనందం వ్యక్తం చేసింది. ఈ ఉత్సాహంతోనే ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తున్నట్లు వారు వెల్లడించారు.

ఈ సక్సెస్ టూర్ నేడు విజయవాడలో మొదలైందని, రాబోయే రోజుల్లో ఏపీ, తెలంగాణలోని పలు ముఖ్య నగరాల మీదుగా సాగుతూ హైదరాబాద్‌లో ముగుస్తుందని నిర్మాతలు తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా తాము థియేటర్ల వద్ద ప్రేక్షకులను ప్రత్యక్షంగా కలుసుకోబోతున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం ‘త్రిముఖ’ థియేటర్లలో ప్రదర్శితమవుతోందని, ప్రేక్షకులు ఆదరించాలని కోరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు