‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి మరో అప్డేట్.. ఆ రోజేనా?

‘ఉస్తాద్ భగత్ సింగ్’ నుండి మరో అప్డేట్.. ఆ రోజేనా?

Published on Feb 5, 2026 7:00 AM IST

Ustaad Bhagat Singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న భారీ యాక్షన్ డ్రామా ‘ఉస్తాద్ భగత్ సింగ్'(Ustaad Bhagat Singh) విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని 2026, మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పవన్ కళ్యాణ్ పవర్‌ఫుల్ లుక్‌తో ఉన్న గ్రాండ్ పోస్టర్‌ను విడుదల చేస్తూ ఈ అప్‌డేట్‌ను అందించారు. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

​ఇక దేవి శ్రీ ప్రసాద్ స్వరపరిచిన మొదటి సాంగ్ ‘దేఖ్ లేంగే సాలే’కు ఇప్పటికే అద్భుతమైన స్పందన లభించింది. తాజా సమాచారం ప్రకారం, ఫిబ్రవరి 15న మహాశివరాత్రి సందర్భంగా చిత్ర బృందం రెండో పాటను విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ఈ పాటతో సినిమా ప్రమోషన్ల వేగాన్ని మరింత పెంచాలని మేకర్స్ భావిస్తున్నారు.

​మైత్రీ మూవీ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు దశరథ్ స్క్రీన్‌ప్లే అందిస్తుండగా, అశుతోష్ రాణా, గౌతమి, నాగ మహేష్ మరియు ‘కేజీఎఫ్’ ఫేమ్ అవినాష్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు