మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులకు కవల పిల్లలు జన్మించిన సంగతి తెలిసిందే. ఐతే, తాజాగా ఉపాసన ఎమోషనల్ పోస్టు పెట్టారు. జనవరి 31న ఆమె కవల పిల్లలకు (బాబు, పాప) జన్మనిచ్చారు. కాగా డెలివరీకి ముందు ఎంత టెన్షన్ పడ్డారు ?, పిల్లలు పుట్టిన తర్వాత ఎలాంటి సందడి నెలకొందో తెలియజేసే వీడియోను తాజాగా ఉపాసన పోస్ట్ పెట్టారు. ఇది చూసినప్పుడల్లా హృదయం ఆనందంతో ఉప్పొంగుతోందంటూ ఆమె తన పోస్ట్ లో తెలిపారు.
ఉపాసన తన పోస్ట్ లో ఇంకా రాసుకొస్తూ.. ‘తమ కుటుంబంపై ప్రేమ చూపించిన వారందరికీ థాంక్స్ అని ఉపాసన చెప్పారు. అపోలో ఆస్పత్రి వైద్యులు, రామ్చరణ్ ఫ్యాన్స్ మద్దతు మరువలేనిదని తెలిపారు. చరణ్ – ఉపాసన దంపతులకు పుట్టిన కవల పిల్లల పై మెగాస్టార్ కూడా మాట్లాడుతూ.. ‘ఉపాసనతో పాటు బిడ్డలిద్దరూ చాలా ఆరోగ్యంగా ఉన్నారు. మా ఇంట శుభం కలగాలని ఎక్కడెక్కడి నుంచో అభిమానులు కోరుకున్నారు. వారి ఆనందానికి అవధుల్లేవు. అందరికీ ధన్యవాదాలు’’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
Every time I watch this, my heart feels full. I’m deeply grateful for the love, strength, and positivity that surrounds us. With folded hands 🙏, THANK YOU
My family is truly blessed.
Tejesvi Garu & the entire @HospitalsApollo team — your care & commitment meant everything to us.… pic.twitter.com/FKRtfBfMy9— Upasana Konidela (@upasanakonidela) February 9, 2026


