India vs Pak T20 World Cup 2026 : 10 రోజుల్లోనే మాట మార్చిన పాకిస్తాన్!.. యూ-టర్న్ వెనుక అసలు కథ ఇదే!

India vs Pak T20 World Cup 2026 : 10 రోజుల్లోనే మాట మార్చిన పాకిస్తాన్!.. యూ-టర్న్ వెనుక అసలు కథ ఇదే!

Published on Feb 10, 2026 6:49 PM IST

India-vs-Pak

క్రికెట్ ప్రపంచం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్‌పై నెలకొన్న సస్పెన్స్ వీడింది. ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా జరగాల్సిన ఈ హై-వోల్టేజ్ మ్యాచ్‌కు లైన్ క్లియర్ అయ్యింది. కేవలం పది రోజుల వ్యవధిలోనే పాకిస్తాన్ గవర్నమెంట్ మరియు క్రికెట్ బోర్డు తమ నిర్ణయాన్ని మార్చుకుని, “యూ-టర్న్” (U-turn) తీసుకోవడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

బాయ్‌కాట్ నుంచి సరెండర్ వరకు.. అసలేం జరిగింది?

గత వారం అంటే ఫిబ్రవరి 1వ తేదీన, పాకిస్తాన్ గవర్నమెంట్ ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. బంగ్లాదేశ్ క్రికెట్ టీమ్‌కు మద్దతుగా, టీ20 వరల్డ్ కప్‌లో భారత్‌తో ఆడబోయే మ్యాచ్‌ను “బాయ్‌కాట్” (Boycott) చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా క్రికెట్ వర్గాల్లో గందరగోళం మొదలైంది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహసిన్ నఖ్వీ కూడా ఈ విషయంలో చాలా సీరియస్‌గా కనిపించారు. భారత్‌తో ఆడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

కానీ, సీన్ కట్ చేస్తే.. సరిగ్గా 10 రోజుల తర్వాత (ఫిబ్రవరి 10న) కథ మొత్తం మారిపోయింది. ఏ గవర్నమెంట్ అయితే మ్యాచ్ ఆడొద్దని చెప్పిందో, అదే గవర్నమెంట్ ఇప్పుడు “జట్టును పంపిస్తున్నాం, మ్యాచ్ ఆడనివ్వండి” అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మొహసిన్ నఖ్వీ, షెహబాజ్ షరీఫ్‌ల డ్రామా

పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మరియు పీసీబీ బాస్ మొహసిన్ నఖ్వీలు ఆడిన ఈ పొలిటికల్ డ్రామా ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మొదట్లో “మాకు ఆత్మగౌరవం ముఖ్యం, బంగ్లాదేశ్‌కు సపోర్ట్ చేస్తాం” అని గొప్పలు చెప్పిన పాకిస్తాన్ పెద్దలు, చివరకు ఐసీసీ (ICC) నిబంధనలు మరియు ఆర్ధిక నష్టాలకు భయపడి వెనక్కి తగ్గక తప్పలేదు.

ఒకవేళ పాకిస్తాన్ నిజంగానే ఈ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేసి ఉంటే, ఆ జట్టు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేది. దాదాపు 174 మిలియన్ డాలర్ల (భారీ మొత్తం) నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని ఐసీసీ హెచ్చరించినట్లు సమాచారం. ఈ “ఫైనాన్షియల్ లాస్” (Financial Loss) భయంతోనే పాక్ వెనక్కి తగ్గిందని విశ్లేషకులు అంటున్నారు.

ఫ్రెండ్లీ దేశాల రిక్వెస్ట్ వల్లేనట!

అయితే, తమ పరువు నిలబెట్టుకోవడానికి పాకిస్తాన్ ఒక కొత్త కారణం చెబుతోంది. శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి మిత్ర దేశాల కోరిక మేరకే తాము ఈ నిర్ణయం మార్చుకున్నామని, “స్పిరిట్ ఆఫ్ క్రికెట్” (Spirit of Cricket) కోసమే మ్యాచ్ ఆడుతున్నామని పాక్ గవర్నమెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. శ్రీలంక ప్రెసిడెంట్ స్వయంగా పాక్ ప్రధానికి ఫోన్ చేసి మాట్లాడారట.

ఏది ఏమైనా, అభిమానులకు మాత్రం ఇది గుడ్ న్యూస్. ఫిబ్రవరి 15న కొలంబోలో దాయాదుల పోరు జరగడం ఖాయమైంది. మైదానంలో పరుగుల వరద పారడమే తరువాయి!

తాజా వార్తలు